If you want to sell joint property.. Read this useful information

 జాయింట్ ప్రాపర్టీని అమ్మాలని చూస్తే..

ఒకరికంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి ఒకే ప్రాపర్టీని కొనుగోలు చేస్తే దాన్ని జాయింట్ ప్రాపర్టీ అంటారు. ఈ ఉమ్మడి ఆస్తిలో ఉన్న భాగస్థులందరికీ సమాన హక్కులు ఉంటాయి. అయితే వీరు తీసుకున్న ప్రాపర్టీకి సంబంధించి క్రయవిక్రయాలు జరపాలంటే మాత్రం తప్పకుండా అందరి అనుమతి కావాలి. ప్రాపర్టీ తీసుకున్న సభ్యుల్లో ఏ ఒక్క వ్యక్తి నిరాకరించినా ప్రాపర్టీని అమ్మడానికి వీలుండదు. మీ అనుమతి లేకుండా.. మీ పార్టనర్.. విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించాలని చూస్తే చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నమ్మక ద్రోహం కింద అతడిపై క్రిమినల్ కేసు పెట్టవచ్చు. మీకు నష్టాన్ని కలిగించే ఎలాంటి పనులు చేసినా నష్టపరిహారాన్ని కోరుతూ అతడిపై నష్టపరిహారం కేసును కూడా ఫైల్ చేసే అధికారం ఇతర భాగస్తులకు ఉంటుంది. కాబట్టి జాయింట్ ప్రాపర్టీ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఇటువంటి ప్రాపర్టీలు కొనాలనుకుంటున్నట్లయితే ప్రాపర్టీ టైటిల్ సెర్చ్ ఆధారంగా ఆస్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ సమాచారంలో ఇంతకు ముందు ఇంటికి ఓనర్ గా ఎవరు ఉన్నారు? ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? ఈ ప్రాపర్టీ మీద ఎంతమందికి అధికారం ఉంది? వంటి వివరాలు ఉంటాయి.

Comments

Popular posts from this blog

Right time to Buy Open plots

BBG Open Plots For Sale